డీకే పుట్టినరోజు వేడుకల్లో సిద్ధరామయ్య.. కర్ణాటక ప్రజలు గొప్ప గిఫ్ట్ ఇచ్చారన్న డీకే
- ఈరోజు డీకే శివకుమార్ పుట్టినరోజు
- నిన్న రాత్రి పార్టీ ప్రముఖులతో కలిసి కేక్ కట్ చేసిన డీకే
- కర్ణాటక ప్రజలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యమన్న డీకే
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్ జన్మదినం నేడు. మరోవైపు తన పుట్టినరోజు వేడుకలను మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ పార్టీ ప్రముఖులతో కలిసి ఆయన జరుపుకున్నారు. కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా డీకే స్పందిస్తూ... కర్ణాటక ప్రజలకు సేవ చేయడానికి తన జీవితం అంకితమని చెప్పారు. తన పుట్టినరోజుకు కర్ణాటక ప్రజలు గొప్ప బహుమతిని ఇచ్చారని అన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన తన కాంగ్రెస్ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
మరోవైపు కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరనే విషయంలో హైటెన్షన్ నెలకొంది. ఢిల్లీకి రావాలంటూ డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. వీరిద్దరితో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ చర్చించనున్నారు. ఆ తర్వాత సీఎం ఎవరనే దానిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.