హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న కీర్తిసురేశ్ .. లేటెస్ట్ పిక్స్

  • మూడు భాషల్లో చక్రం తిప్పుతున్న బ్యూటీ 
  • 'దసరా' సినిమాతో మరిన్ని మార్కులు 
  • తదుపరి సినిమాగా రానున్న 'భోళా శంకర్'
కీర్తి సురేశ్ బలమైన సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు సినిమా ఇండస్ట్రీకి చెందినవారే. చైల్డ్ ఆర్టిస్టుగా అనేక చిత్రాలలో నటించిన కీర్తి సురేశ్, ప్రస్తుతం తెలుగు .. తమిళ ... మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తోంది. గ్లామర్ తో పాటు నటనకి స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూ వెళుతోంది. కెరియర్ ఆరంభంలోనే 'మహానటి' సినిమాలో మెప్పించిన కీర్తి సురేశ్ ను చూసిన ప్రేక్షకులు, ఈ అమ్మాయి సామాన్యురాలు కాదనే విషయాన్ని గ్రహించారు. కీర్తి సురేశ్ ఒక పాత్రలో ఎంతగా ఒదిగిపోతుందనే విషయాన్ని ఇటీవల వచ్చిన 'దసరా' సినిమా మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'భోళా శంకర్' ఉంది. ఈ సినిమాలో ఆమె మెగాస్టార్ కి చెల్లెలిగా నటించింది. ఆ మధ్య కీర్తి సురేశ్ చాలా సన్నబడిపోయి ఆకర్షణను కోల్పోయింది. ఆమె తీసుకున్న ఆ నిర్ణయం పట్ల అభిమానులు అసహనాన్ని ప్రదర్శించారు. అప్పటి నుంచి ఆమె ప్రయత్నిస్తూ ప్రస్తుతం గాడిలో పడిపోయింది. ఇప్పుడు కీర్తి సురేశ్ ను చూసినవారు గ్లామర్ పరంగా ఇకపై ప్రయోగాలు చేయకుండా ఇలా కంటిన్యూ అవమంటున్నారు. లేటెస్ట్ పిక్స్ లో ఆమె అంత హాట్ గా ... అంత క్యూట్ గా కనిపిస్తోంది మరి. 



More Telugu News