హీరోయిన్ అదాశర్మకు బెదిరింపులు.. ఫోన్ నెంబర్ లీక్
- 'ది కేరళ స్టోరీ' చిత్రంలో నటించిన అదాశర్మ
- ముస్లింలకు వ్యతిరేకంగా సినిమాలు చేస్తే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అదాకు బెదిరింపులు
- సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అదాశర్మ
ముంబై భామ అదాశర్మ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్ లో హీరోయిన్ గా పలు చిత్రాల్లో ఆమె నటించింది. కొంత కాలంగా ఆమెకు సినీ అవకాశాలు తగ్గిపోయినప్పటికీ... తాజాగా 'ది కేరళ స్టోరీ' సినిమాతో ఆమె మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు ప్రేమించి, వారిని ఉగ్రవాదులుగా మారుస్తున్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తాయి. నిరసనల మధ్యే ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
మరోవైపు ఈ చిత్రంలో అదాశర్మ ప్రధాన పాత్రను పోషించింది. ఈ నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆమె వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆమె ఫోన్ నెంబర్ ను లీక్ చేశాడు. అంతేకాదు, మస్లింలకు వ్యతిరేకంగా ఇకపై సినిమాలు చేస్తే దారుణమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.