డీజే టిల్లు సిద్దూ సరసన సమంత.. నిజమేనా!

  • నందిని రెడ్డి దర్శకత్వంలో యూత్ ఎంటర్‌‌టైనర్‌‌
  • సమంత ఇమేజ్‌కు తగ్గట్టు బలమైన పాత్ర ఉంటుందని వార్తలు
  • ప్రస్తుతం టిల్లూ స్క్వేర్‌‌లో నటిస్తున్న సిద్దూ
‘డీజే టిల్లు’ హిట్ తో టాలీవుడ్ లో నిలదొక్కుకున్న నటుడు సిద్దూ జొన్నలగడ్డ యూత్‌లో ఎంతో క్రేజ్ సంపాదించాడు. దీనికి సీక్వెల్‌గా ‘టిల్లూ స్క్వేర్‌’ సినిమాలో బిజీగా ఉన్నాడు. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రం తర్వాత తను సుకుమార్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. మరోవైపు నందిని రెడ్డి దర్శకత్వంలోనూ సిద్దూ నటిస్తాడని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఓ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ అని టాక్. ఇంకా ఖరారు కాని ఈ చిత్రం గురించి తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది. 

ఇందులో సిద్దూ సరసన హీరోయిన్‌గా సమంత నటిస్తుందట. నందిని రెడ్డికి సమంతతో మంచి అనుబంధం ఉంది. దాంతో, ఆమెకు కథ చెప్పగా సమంత ఒప్పుకుందని అంటున్నారు. దేశ వ్యాప్తంగా సమంత ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని నందిని ఆమె పాత్రను డిజైన్‌ చేస్తోందని టాలీవుడ్‌లో టాక్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది. నిజంగానే సిద్దూ సరసన నటించేందుకు సమంత అంగీకరిస్తే టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ అభిమానులను అలరించడం ఖాయమే.


More Telugu News