నీ బిల్డప్ ఏంది.. వెధవ సోది ఆపు: కేశినేని నానిపై పీవీపీ విమర్శలు
- అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టుగా మాట్లాడుతున్నాడని పీవీపీ ఎద్దేవా
- దొబ్బేది బ్యాంకులను, జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు అని విమర్శ
- కొవ్వు తగ్గించే పనిలో ఉండాలని వ్యాఖ్య
టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీగా టీడీపీ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా లెక్క చేయనని.. ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధమేనని కేశినేని చెప్పారు. మరోవైపు, కేశినేని నాని వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని వైసీపీ ఎంపీ ఆళ్ల ఆయోధ్యరామి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బెజవాడ రాజకీయాలు వేడెక్కాయి.
ఈ క్రమంలో వైసీపీ నేత, వ్యాపారవేత్త, గత ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసి 8,726 ఓట్ల తేడాతో ఓడిపోయిన పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ స్పందించారు. కేశినేని నానిపై ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'నీ బిల్డప్ ఏందయ్యా కేశినేని నాని. నీవేదో అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు... ప్రజాసేవ కోసం పుట్టానంటావు. కానీ, దొబ్బేది బ్యాంకులని, జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు. వెరసి మన బెజవాడోళ్లందరికీ చేతిలో చిప్ప, నోటిలో మట్టి. వెధవ సోది ఆపి, కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు. తర్వాత ఎన్నికల బరిలో దొర్లుకుంటూ వద్దువు' అని మండిపడ్డారు.