నా తండ్రి నాకు చెప్పినట్లుగా నీకు చెబుతున్నా: తనయుడికి సచిన్ టెండూల్కర్ సలహా

  • ఆటపై దృష్టి సారించాలని అర్జున్ కు మాస్టర్ సూచన
  • తన కుటుంబం తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని వ్యాఖ్య
  • అర్జున్ కు కూడా తాను అదే వాతావరణం ఇవ్వాలనుకుంటున్నానన్న సచిన్
తనయుడు అర్జున్ తన ఆటపై మాత్రమే దృష్టి సారించాలని సచిన్ టెండూల్కర్ సూచించాడు. 'సింటిలేటింగ్ సచిన్' పుస్తకావిష్కరణలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన స్వేచ్ఛను ఇవ్వాలని సూచించాడు. పిల్లలు తాము కోరుకున్న రంగాల్లో రాణించడానికి కుటుంబం మద్దతు చాలా అవసరమని చెప్పాడు. తనకు కూడా తన కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డారని చెప్పాడు.

తనకు ఏదైనా సమస్య వస్తే అజిత్ టెండూల్కర్ చూసుకునే వాడని చెప్పాడు. తన తల్లి ఎల్ఐసీలో ఉద్యోగం, తండ్రి ప్రొఫెసర్ అని చెప్పాడు. వారు తనకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చారని చెప్పాడు. తల్లిదండ్రులు ఇదేవిధంగా తమ పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పాడు. తనకు తన తల్లిదండ్రులు ఎలాంటి స్వేచ్ఛను ఇచ్చారో తన తనయుడు అర్జున్ కు కూడా అదే రకమైన వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. నీపై నీకు నమ్మకం ఉన్నప్పుడే ఎదుటివారిపై కూడా ఏర్పడుతుందని చెప్పాడు. ఆటపై దృష్టి పెట్టమని తన తండ్రి తనకు ఎప్పుడూ చెప్పేవాడని, ఇప్పుడు అర్జున్ కు కూడా తాను అదే చెబుతున్నానని అన్నాడు.


More Telugu News