ప్రభుత్వ పనులకు బిల్లులు ఆలస్యం కావడం కొత్తేమీ కాదు: మంత్రి ఆదిమూలపు సురేశ్
- ప్రభుత్వ పనులకు బిల్లులు ఆలస్యం సహజమేనన్న మంత్రి
- చిన్న పనులకు కూడా బిల్లులు వెంటనే కావాలంటే ఎలా అని అసహనం
- చిన్న పనులు పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తే ఇబ్బంది ఉండేది కాదని వెల్లడి
కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, తదితర అంశాలపై ఏపీ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. ప్రభుత్వ పనులకు బిల్లులు ఆలస్యం కావడం సాధారణమైన విషయమేనని అన్నారు. మున్సిపాలిటీల పరిధిలో చిన్న పనులకు కూడా వెంటనే బిల్లులు కావాలంటే ఎలా? అని అసహనం వ్యక్తం చేశారు. చిన్న పనులను ప్యాకేజీలుగా పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తే ఇబ్బంది వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.
ఇక, ఇంటి పన్ను పెరిగినా ప్రభుత్వం వసూలు చేసింది చాలా తక్కువ అని మంత్రి ఆదిమూలపు సురేశ్ అభిప్రాయపడ్డారు. ఇంటి పన్ను బకాయిలు ఓకేసారి చెల్లిస్తే వడ్డీ ఉండదని ప్రకటించామని స్పష్టం చేశారు. వడ్డీ మాఫీ వల్ల ప్రభుత్వంపై రూ.3,500 కోట్ల భారం పడినట్టవుతుందని వివరించారు.
దేశంలో ఎక్కడా చెత్తపై పన్ను లేదని, అది యూజర్ చార్జీ మాత్రమేనని వివరణ ఇచ్చారు. ఏపీలో చెత్తపై కూడా పన్ను వేశారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తుండడం తెలిసిందే.