తెలంగాణలో 13 జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్
- వచ్చే నాలుగు రోజులు మండే ఎండలేనని ఐఎండీ వార్నింగ్
- జూన్ నెలలో కూడా నమోదవుతున్న అసాధారణ ఉష్ణోగ్రతలు
- ఝార్ఖండ్, బెంగాల్, సిక్కింలలో పలు ప్రాంతాలకూ హెచ్చరిక
మే నెల ముగిసింది.. జూన్ వచ్చేసింది. అయినా ఎండల తీవ్రత తగ్గడంలేదు. ఏప్రిల్, మే నెలల్లో వాతావరణ శాఖ హీట్ వేవ్ అలర్ట్ లు జారీ చేయడం మామూలే. కానీ, ఈసారి అసాధారణంగా జూన్ మొదటి వారంలో ఐఎండీ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని 13 జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. తెలంగాణతో పాటు బెంగాల్, ఛత్తీస్ గఢ్, సిక్కింలలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఇక జూన్ 7 (బుధవారం) సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, అదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు, జూన్ 8, 9 తేదీలలో అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, అదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు వాతావరణ శాఖ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ప్రజలకు సూచించింది. అత్యవసర పరిస్థితులలో బయటకు వెళ్లేవారు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.