ఆడేది అందుకోసమే కదా: రోహిత్ శర్మ

  • రేపటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
  • ఓవల్ లో అమీతుమీకి సిద్ధమైన టీమిండియా, ఆసీస్
  • కెప్టెన్సీ వదులుకునే లోపు ఒకట్రెండు టోర్నీలు గెలవాలనుందని రోహిత్ ఆకాంక్ష
ఏ క్రీడలో అయినా విజేతగా నిలవడమే పరమావధి అని భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకునే లోపు ఒకట్రెండు ప్రధాన టోర్నీలు గెలవాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. రేపు ఓవల్ లో టీమిండియా, ఆసీస్ జట్లు మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హిట్ మ్యాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

"నేను గానీ, నాకంటే ముందు కెప్టెన్సీ నిర్వర్తించినవారు కానీ, నా తర్వాత వచ్చే వారు కానీ... భారత క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడం, వీలైనన్ని మ్యాచ్ లు, వీలైనన్ని టోర్నీలు గెలవడమే వారి కర్తవ్యం. నాకైనా ఇదే వర్తిస్తుంది. మ్యాచ్ లు గెలవాలని, చాంపియన్ షిప్ లు గెలవాలని ఆకాంక్షిస్తాను. ఎవరైనా ఆడేది గెలుపు కోసమే కదా" అని రోహిత్ శర్మ వివరించాడు.


More Telugu News