గజదొంగల కథలతో ఇక్కడ రవితేజ .. అక్కడ కార్తి!
- 'టైగర్ నాగేశ్వరరావు'గా రవితేజ
- ఒక గజదొంగ కథగా నడిచే సినిమా
- అదే తరహా కాన్సెప్టుతో కార్తి 'మురుగన్'
- కథానాయికగా కనిపించనున్న అనూ ఇమ్మాన్యుయేల్
రవితేజ కథానాయకుడిగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా రూపొందుతోంది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటు ప్రజలను .. అటు పోలీస్ వారిని నానా తిప్పలు పెట్టిన స్టూవర్టుపురం గజదొంగ కథ ఇది. ఆ పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. ఇక సినిమా పరమైన మార్పులు చేర్పులు ఉంటూనే ఉంటాయి.
తమిళంలో కార్తి కూడా గజదొంగ నేపథ్యంలో సాగే కథనే చేస్తున్నాడు. కార్తి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఆ సినిమా పేరు 'మురుగన్'. గతంలో ఒక నగల దుకాణం నుంచి 13 కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించిన గజదొంగ కథ ఇది. ఎస్. ప్రకాశ్ బాబు - ఎస్. ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాకి, రాజు మురుగన్ దర్శకత్వం వహించాడు.
కార్తి చేస్తున్న ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కార్తి జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనుంది. ఒక కీలకమైన పాత్రలో సునీల్ కనిపించనున్నాడు. గజదొంగల నేపథ్యంలో రూపొందుతున్న ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందనేది చూడాలి.