బాలీవుడ్ నటుడితో ప్రేమ బంధాన్ని ఒప్పుకున్న తమన్నా
- కొన్నాళ్లుగా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న మిల్కీ బ్యూటీ
- లస్ట్ స్టోరీస్ 2 సెట్స్‌లో తమ లవ్ స్టోరీ మొదలైందన్న తమన్నా
- టాలీవుడ్, బాలీవుడ్ లో బిజీగా ఉన్న నటి
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో సంబంధంపై మిల్కీ బ్యూటీ తమన్నా ఎట్టకేలకు పెదవి విప్పింది. ఆయనతో ప్రేమ నిజమేనని ఒప్పుకుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురించిందో తెలిపింది. లస్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్ లో తొలిసారి కలిసి నటించిన ఈ ఇద్దరి మధ్య పరిచయమై, అది ప్రేమగా మారింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఆ సంగతులు వెల్లడించింది. కేవలం సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదని, తను చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పింది.
‘మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్‌గా బంధం ఉంది. తను నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. నా మనసుకు దగ్గరైన వ్యక్తి. నేను చాలా శ్రద్ధ వహించే వ్యక్తి అతను. తను ఉన్న చోటే నాకు సంతోషకరమైన ప్రదేశం’ అని తమన్నా చెప్పుకొచ్చింది. కాగా, ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్‌లో వరుస సినిమాలు, సిరీస్ లతో తమన్నా బిజీగా ఉంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.