గంగానదిలోంచి మొసలిని బయటకు లాగి కొట్టి చంపేసిన గ్రామస్థులు!

  • బీహార్‌లోని వైశాలి జిల్లా రాఘోపూర్ గ్రామంలో వెలుగు చూసిన ఘటన
  • కొత్త బైక్‌కు పూజ కోసం పవిత్ర జలం తెచ్చేందుకు గంగానదిలోకి దిగిన బాలుడు
  • బాలుడిపై మొసలి దాడి, కుటుంబసభ్యులు చూస్తుండగా చంపి తినేసిన వైనం
  • మొసలిని బయటకు లాగి రాడ్లు, కర్రలతో కొట్టి చంపిన గ్రామస్థులు
పద్నాలుగేళ్ల బాలుడిని చంపి తినేసిన మొసలిని గ్రామస్థులు నదిలోంచి బయటకు లాగి చంపేశారు. బీహార్‌లోని వైశాలి జిల్లాలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాఘోపూర్ దియారా గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల కొత్త బైక్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో వాహనపూజకు కావాల్సిన పవిత్ర జలం కోసం అమిత్ కుమార్ అనే బాలుడు గంగానదిలోకి దిగాడు. 

అమిత్ నదిలో స్నానం చేస్తుండగా మొసలి దాడి చేసి అతడిని కుటుంబసభ్యుల ముందే తినేసింది. దీంతో, కుటుంబసభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. బాలుడిని చంపిన మొసలిని నదిలోంచి బయటకు లాగి రాడ్లు, కర్రలతో కొట్టి చంపేశారు.


More Telugu News