బీజేపీ గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు: సోము వీర్రాజు
- జగన్ ను బీజేపీ ఎప్పుడూ సమర్థించలేదన్న సోము వీర్రాజు
- వైసీపీతో బీజేపీ ఎప్పుడుందో జగన్ చెప్పాలని డిమాండ్
- ఏపీ అవినీతి మంత్రులపై బీజేపీ పోరాడుతుందని వ్యాఖ్య
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తనకు అండగా ఉండకపోవచ్చన్న జగన్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ... జగన్ ను బీజేపీ ఏనాడూ సమర్థించలేదని, ఆయనకు అండగా లేదని చెప్పారు. వైసీపీతో బీజేపీ ఎప్పుడుందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ అనుసరిస్తున్న విధానాలను ర్యాలీలు, సభలు, ఆందోళనల ద్వారా ప్రజలకు వివరించామని తెలిపారు. మతతత్వ వైఖరితో బీజేపీ లేదని... ఆ వైఖరితో వైసీపీ ఉందని అన్నారు. బీజేపీ గురించి మాట్లాడే హక్కు కూడా జగన్ కు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సపోర్ట్ చేయడని జగన్ ఎలా చెపుతారని వీర్రాజు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ బీజేపీతోనే ఉన్నారని చెప్పారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ గురించి వైసీపీ నేతలు ఎప్పుడూ మాట్లాడరని... వారి పార్టీని విమర్శించినప్పుడే వారికి ఇవి గుర్తొస్తాయని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో అంతులేని అవినీతి జరుగుతోందని.... ఏపీ అవినీతి మంత్రులపై బీజేపీ పోరాడుతుందని వీర్రాజు చెప్పారు.