అందుకు ఇంకా చాలా సమయం ఉంది: హీరోయిన్ శ్రీలీల

  • వరుస సినిమాలతో బిజీగా శ్రీలీల
  • మంచి పాత్రలు చేయాలనేదే తన ఆలోచనని వ్యాఖ్య 
  • హీరోల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటున్నానని వెల్లడి 
  • బాలీవుడ్ కి వెళ్లడమనేది తన చేతుల్లో లేదన్న శ్రీలీల 

'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రీలీల, ఒక రేంజ్ లో అందాల సందడి చేస్తూ దూసుకుపోతోంది. 'ధమాకా' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ, బాలకృష్ణ .. పవన్ .. మహేశ్ .. నితిన్ .. రామ్ .. విజయ్ దేవరకొండ .. వైష్ణవ్ తేజ్ లతో వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. 

ఈ రోజున శ్రీలీల పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆమె సినిమాలకి సంబంధించిన పోస్టర్స్ తో సోషల్ మీడియాలోను గట్టిగానే సందడి కనిపిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ .."సినిమాలన్నా .. నటనన్నా నాకు చాలా ఇష్టం. అందువల్లనే ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులను చేయడమనేది నాకు కష్టంగా అనిపించడం లేదు" అని అంది. 

"మొదటి నుంచి కూడా మంచి బ్యానర్లు .. మంచి కథలు .. పాత్రలు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను పనిచేస్తూ వెళుతున్న ప్రతి హీరో నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాను. బాలీవుడ్ ఛాన్సుల గురించి ఆలోచించలేదు .. అయినా అందుకు చాలా సమయం ఉంది. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే, మంచి సినిమాలు చేశాననే సంతృప్తి కలగాలి .. అలాంటి సినిమాలు చేసుకుంటూ వెళతాను" అంటూ చెప్పుకొచ్చింది. 


More Telugu News