ఇన్నాళ్లూ పవన్ ను ఎవరైనా తిరగొద్దన్నారా?: సజ్జల

  • నేటి నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
  • చంద్రబాబును సీఎం చేయడం కోసమే పవన్ బయల్దేరాడన్న సజ్జల
  • జనసేనకు సింబల్ ఉందో లేదో తెలియదని ఎద్దేవా 
  • పవన్ తనను నమ్ముకున్నవాళ్లను కూడా మోసం చేస్తున్నాడని విమర్శలు
జనసేనాని పవన్ కల్యాణ్ నేటి నుంచి వారాహి యాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబును సీఎం చేయడం కోసమే పవన్ బయల్దేరాడని వ్యాఖ్యానించారు. 

జనసేనకు సంస్థాగత వ్యవస్థలు, పార్టీ సింబల్ ఉన్నాయని తాను భావించడంలేదని అన్నారు. ఎన్నికల్లో ఎవరూ గాజు గ్లాసు గుర్తు తీసుకోకపోతే జనసేనకు ఇస్తారేమో తెలియదు కానీ... పవన్ కల్యాణ్ కేవలం సినీ హీరోగా తనకున్న పాప్యులారిటీని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నాడని సజ్జల విమర్శించారు. 

"ఇప్పటిదాకా మీన మేషాలు లెక్కించిన పవన్ ఇప్పుడు వారాహి యాత్ర చేస్తానంటున్నాడు. ఇన్నాళ్లూ పవన్ ను ఎవరైనా తిరగొద్దన్నారా? మాకేం అభ్యంతరం లేదు... తిరగొచ్చు. చంద్రబాబు ఇచ్చిన అసైన్ మెంట్ తో యాత్ర ప్రారంభిస్తున్న పవన్ నాలుగు డైలాగులు రాసుకుని వచ్చాడు. పవన్ కు ఓ రాజకీయ పార్టీ అధినేతకు ఉన్న విలువలు ఉన్నాయా? పవన్ ప్రజలను మోసం చేస్తున్నాడు... తనను నమ్ముకున్నవాళ్లను కూడా మోసం చేస్తున్నాడు. అది కూడా, మోసం చేస్తున్నానని బహిరంగంగా చెబుతున్నాడు. చంద్రబాబును సీఎం చేయడమే నా లక్ష్యం అని ఓపెన్ గా చెబుతున్నాడు" అని వివరించారు.


More Telugu News