నల్ల బంగారం, తెల్ల బంగారం మన దగ్గరే ఉన్నాయి: కేటీఆర్​

  • తెలంగాణలో పండే తెల్ల పత్తి ఎక్కడా దొరకదన్న మంత్రి
  • వరంగల్ లో యంగ్ వన్ కంపెనీ వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన
  • వరంగల్‌ కు పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ
నల్ల బంగారం, తెల్ల బంగారం సమృద్ధిగా దొరికే ప్రాంతం తెలంగాణ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పండే తెల్ల పత్తి ఎక్కడా దొరకదని చెప్పారు. ఈ రోజు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్ పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో యంగ్‌ వన్‌ కంపెనీ వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.

 ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నల్ల బంగారం (బొగ్గు) సమృద్ధిగా లభించే సింగరేణి ఉందన్నారు. అలాగే నాణ్యమైన తెల్ల బంగారం కూడా మన దగ్గరే లభిస్తుందన్నారు. వరంగల్ కు పూర్వ వైభవం కలిగే విధంగా కాకతీయ మెగా టెక్ట్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొరియా దేశం నుంచి యంగ్ వన్ సంస్థ ముందుకు వచ్చి ఇక్కడ యూనిట్ స్థాపించిందన్నారు. మొత్తం 11 ఫ్యాక్టరీల ఏర్పాటుతో 20 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. 99 శాతం స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.


More Telugu News