అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న అందాల అతుల్య!

  • 'మీటర్' సినిమాతో పరిచయమైన అతుల్య రవి 
  • ఆమె కెరియర్ కి హెల్ప్ కాలేకపోయిన సినిమా 
  • ఫొటో షూట్ లతో బిజీగా ఉన్న భామ 
  • ఆమె జోరు కొనసాగడం ఖాయమంటున్న కుర్రాళ్లు  
తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉన్నారు. అలా ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన భామలలో 'అతుల్య రవి' ఒకరు. 2017లోనే ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడ దాదాపు ఓ డజనుకు పైగా సినిమాలు చేసింది. 'మీటర్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన ఈ సినిమాలో ఆమె అతని జోడీగా మెరిసింది. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. అయితే గ్లామర్ పరంగా అతుల్యకి మంచి మార్కులు పడిపోయాయి. ఈ అమ్మాయి ఇక్కడ కొంతకాలం పాటు సందడి చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఇక అతుల్య కూడా ఎప్పటికప్పుడు కొత్తగా ఫొటో షూట్ లు చేయిస్తూ, కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. అలా లేటెస్ట్ గా ఆమె వదిలిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. బ్లాక్ కలర్ డ్రెస్ లో ఈ సుందరి మరింతగా మతులుపోగొడుతోంది. అతుల్యలో ఆమె కళ్లు .. నవ్వు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ కూడా ఆమె వాటితోనే మెస్మరైజ్ చేస్తోంది.



More Telugu News