ఈ పాప జన్మ ఘడియలు మంచివని అంటున్నారు... పుట్టకముందే మాకు శుభాలు జరిగాయి: చిరంజీవి
- తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసన
- పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చిన ఉపాసన
- ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన చిరంజీవి
మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది. మెగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు సహా మెగాభిమానులు ఈ విషయంతో సంతోషంగా ఉన్నారు. మనవరాలు పుట్టడంపై మెగాస్టార్ చిరంజీవి మీడియా ముఖంగా స్పందించారు.
‘‘మంగళవారం ఉదయం రామ్‌చరణ్, ఉపాసనలకు పాప పుట్టింది. ఇంటిల్లిపాది చాలా సంతోషంగా ఉన్నాం. ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల నుంచి మా స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మా సంతోషాన్ని తమ సంతోషంగా భావించే అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ నా కుటుంబం తరపున ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను.
పెద్దలు పాప పుట్టిన ఘడియలు చాలా మంచివని అంటున్నారు. ఆ ప్రభావం పాప పుట్టక ముందు నుంచి మాకు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో చరణ్ ఎదుగుదల కానివ్వండి, తను సాధించిన విజయాలను కానివ్వండి... అలాగే ఈ మధ్య వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్.... ఇలా మా ఇంట్లో అన్నీ శుభకార్యాలే జరగటం చూస్తుంటే ఈ బిడ్డ ప్రభావం కూడా ఉందని నేను అనుకుంటున్నాను.
నా కుటుంబం, నేను ఆంజనేయ స్వామినే నమ్ముకున్నాం. ఆయనకు సంబంధించి పరమ పవిత్రమైన మంగళవారం రోజున ఆడ బిడ్డను ప్రసాదించటం అనేది అపురూపంగా భావిస్తున్నాం. అపోలో ఆసుపత్రిలో బెస్ట్ టీమ్ పర్యవేక్షణలో చాలా సుఖంగా ప్రసవం జరిగింది. అందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు.
కాగా, రామ్ చరణ్-ఉపాసన దంపతులు పుత్రికను చూసేందుకు మెగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలివచ్చారు. చిరంజీవి-సురేఖ, వరుణ్ తేజ్, కొణిదెల నిహారిక, అల్లు అర్జున్-స్నేహారెడ్డి, అల్లు అరవింద్ తదితరులు ఆసుపత్రికి వచ్చారు.