మళ్లీ పెళ్లి స్ట్రీమింగ్ ఆపేసిన అమెజాన్

  • రమ్య రఘుపతి లీగల్ నోటీసుల నేపథ్యంలో నిర్ణయం
  • తనను కించపరిచేలా చూపెట్టారంటూ న్యాయ పోరాటం
  • ఆహాలో ప్రసారమవుతున్న సినిమా
సీనియర్ నటుడు నరేశ్ కొత్త సినిమా ‘మళ్లీ పెళ్లి’ స్ట్రీమింగ్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఆపేసింది. శుక్రవారం నుంచి అమెజాన్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. నరేశ్ మాజీ భార్య రమ్య రఘుపతి లీగల్ నోటీసులు పంపించడంతో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆహాలో మాత్రం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 

నరేశ్ తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి విడిపోయి, ప్రస్తుతం నటి పవిత్ర లోకేశ్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రేమకథను మళ్లీ పెళ్లి పేరుతో తెరకెక్కించారు. తన జీవితంలోని విశేషాలు, పెళ్లిళ్లకు కారణాలను ఇందులో చూపెట్టినట్లు సమాచారం. అయితే, ఈ సినిమాలో తనను విలన్ గా చూపించారని రమ్య రఘుపతి కోర్టుకెక్కారు. అయినా సినిమా విడుదల ఆపలేకపోయారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీల్లోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ తో పాటు అల్లు అరవింద్ కు చెందిన ఆహాలో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో రమ్య రఘుపతి ఈ రెండు ఓటీటీలకు లీగల్ నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్న అమెజాన్.. మళ్లీ పెళ్లి సినిమా విషయంలో వెనుకడుగు వేయగా, ఆహా మాత్రం స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సమాచారం.


More Telugu News