విశాఖలో గన్ లైసెన్సులపై సీపీ త్రివిక్రమ వర్మ స్పందన
- విశాఖలో వరుస కిడ్నాప్ ల కలకలం
- మంత్రి గుడివాడ అమర్నాథ్ గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలు
- గుడివాడ అమర్నాథ్ 2020లోనే దరఖాస్తు చేశారన్న పోలీస్ కమిషనర్
ఇటీవల విశాఖలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో, నగరంలో శాంతిభద్రతలు లోపించాయని, విశాఖ నేరగాళ్లకు నిలయంగా మారిందని విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేసినట్టు వార్తలు వచ్చాయి.
కాగా, విశాఖలో గన్ లైసెన్సులపై నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ స్పందించారు. విశాఖలో 620 గన్ లైసెన్సులు ఉన్నాయని వెల్లడించారు. 2020 నుంచి కేవలం 15 మందే తుపాకీ కావాలని దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.
గుడివాడ అమర్నాథ్ 2020లోనే కలెక్టరేట్ ద్వారా దరఖాస్తు చేశారని సీపీ తెలిపారు. ఇటీవల కిడ్నాప్ కు గురైనవారు ఇద్దరు గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు.