అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చిన 'వీరన్'

  • జూన్ 2న థియేటర్లకు వచ్చిన 'వీరన్'
  • జూన్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ 
  • అందుబాటులోకి వచ్చిన తెలుగు వెర్షన్ 
  • పిల్లలకి కనెక్ట్ అయ్యే కంటెంట్
హిప్ హాఫ్ తమిళ ఆది హీరోగా రూపొందిన 'వీరన్' అనే సినిమా జూన్  2వ తేదీన అక్కడ విడుదలైంది. టి.జి. త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమాకి ఎ.ఆర్.కె. శరవణన్ దర్శకత్వం వహించాడు. అథీరా రాజ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, కాళీ వెంకట్ .. మునీశ్ కాంత్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ సినిమా,  జూన్ 30వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. 

అది తమిళనాడులోని ఒక మారుమూల గ్రామం. అక్కడి వాళ్లంతా 'వీరన్న'ను గ్రామదేవతగా ఆరాధిస్తూ ఉంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఆయన గుర్రంపై వస్తాడని వారి నమ్మకం. అయితే కుమారన్ (హిప్ హాప్) మాత్రం వీరన్న మహిమలను గురించి నమ్మడు. ఆ విషయంలో అతని స్నేహితురాలు సెల్వి ఎంతగా చెప్పిచూసినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఒక రోజున కుమారన్ స్కూల్ కి వెళ్లి వస్తుండగా. పిడుగులాంటి ఒక శక్తి కిరణం వచ్చి కుమారన్ ను తాకుతుంది. దాంతో అతను చాలా అనారోగ్యానికి లోనవుతాడు. కుమారన్ ను అతని అక్కయ్య సింగపూర్ తీసుకుని వెళుతుంది. 

తనకి మానవాతీతమైన శక్తులేవో వచ్చినట్టుగా అప్పుడు కుమారన్ కి అర్థమవుతుంది. ఒక రోజున తన గ్రామం ప్రమాదంలో పడనున్నట్టుగా అతనికి అనిపించడంతో, 14 ఏళ్ల తరువాత తన గ్రామానికి చేరుకుంటాడు. ఆ గ్రామానికి ప్రమాదం ఎటువైపు నుంచి పొంచి ఉంది? అది తెలుసుకున్న కుమరన్ ఏం చేస్తాడు? అనేదే కథ. బ్యూటిఫుల్ లొకేషన్స్ కోసం .. అందమైన చిత్రీకరణ కోసం ఈ సినిమా చూడొచ్చు. ఫాంటసీ మూవీ కనుక పిల్లలకి ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.


More Telugu News