తెలంగాణలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలు

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • యాదాద్రి భువనగిరి సహా ఎనిమిది జిల్లాల్లో ఏర్పాటు
  • 10 వేలకు చేరువకానున్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య
తెలంగాణలో కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, జోగులాంబ గ‌ద్వాల‌, నారాయ‌ణ‌పేట, మెద‌క్, ములుగు, వ‌రంగ‌ల్ జిల్లాల్లో కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. కొత్తగా ఏర్పాటయ్యే ఎనిమిది వైద్య కళాశాలలతో కలిపి తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10 వేలకు చేరువకానుంది. 


More Telugu News