తెలుగు క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన చంద్రబాబు
- ఐపీఎల్ లో అదరగొట్టిన తిలక్ వర్మ
- వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక
- తిలక్ వర్మను టీమిండియా టీ20 జట్టుకు ఎంపిక చేసిన సెలెక్టర్లు
- తిలక్ వర్మ ప్రస్థానం విజయవంతంగా కొనసాగాలని చంద్రబాబు ఆకాంక్ష
హైదరాబాద్ యువ కెరటం, తెలుగుతేజం తిలక్ వర్మ వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు భారత జట్టులో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో తన పవర్ హిట్టింగ్ తో అలరించిన ఎడమచేతివాటం బ్యాట్స్ మన్ తిలక్ వర్మను సెలెక్టర్లు విండీస్ టూర్ కు ఎంపిక చేశారు.
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. తిలక్ వర్మకు అభినందనలు తెలిపారు. ఆకట్టుకునే బ్యాటింగ్ ప్రదర్శన, కఠోర శ్రమ కారణంతో భారత టీ20 జట్టులో స్థానం సంపాదించేందుకు అర్హుడయ్యాడని కితాబిచ్చారు. ఓ తెలుగు కుర్రాడిగా తెలుగు సమాజాన్ని గర్వపడేలా చేశాడని చంద్రబాబు కొనియాడారు.
తిలక్ వర్మ తన క్రికెట్ ప్రయాణంలో నిరంతరం విజయాల బాటలోనే పయనించాలని, మరింత ఉజ్వలంగా ప్రకాశించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. చంద్రబాబు విషెస్ పట్ల తిలక్ వర్మ స్పందించాడు. థాంక్యూ సో మచ్ సర్ అంటూ వినమ్రంగా బదులిచ్చాడు.