లైఫ్‌లో విజయం సాధించాలంటే ఏం చేయాలో చెప్పిన ఆనంద్ మహీంద్రా.. వీడియో వైరల్

  • బాతు, పులి వీడియోతో సక్సెస్ ఫార్ములా విడమర్చి చెప్పిన ఆనంద్ మహీంద్రా
  • అకస్మాత్తుగా నీట మునిగి పులి నుంచి తప్పించుకున్న బాతు
  • సడెన్‌గా బాతు అదృశ్యం కావడంతో పులికి షాక్
  • ఎవరికీ తెలియకుండా వ్యూహాన్ని అమలు చేయడమే సక్సెస్ సూత్రమని మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ‘మండే మోటివేషన్’ పేరిట నెట్టింట పంచుకునే స్ఫూర్తివంతమైన విషయాలు నిత్యం వైరల్ అవుతుంటాయి. ఈసారి ఆయన షేర్ చేసిన వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. లైఫ్‌లో విజయం సాధించాలన్నా, అపాయం నుంచి బతికిబట్టకట్టాలన్నా ఏం చేయాలో చెబుతూ ఆయన ఈ వీడియో షేర్ చేశారు. 

ఇందులో ఓ బాతు సరస్సులో ఈదుతుండగా వెనక నుంచి ఓ పులి దానిపై దాడి చేసేందుకు దాన్ని సమీపించింది. పులి రాకను ముందే పసిగట్టిన బాతు దానికి ఊహించని షాకిచ్చింది. యథాప్రకారం ముందుకు వెళ్లిన బాతు అకస్మాత్తుగా నీట మునక వేసి అదృశ్యమైపోయింది. బాతు ఎక్కడికెళ్లిందో అర్థంకాక కొన్ని నిమిషాల పాటు దిమ్మెరపోయింది. ఏం జరిగిందో అర్థంకాక అటూ ఇటూ తలతిప్పి చూసింది. ఈలోపు పులికి కనపడకుండా మరోమారు పైకి తేలిన బాతు మళ్లీ నీటమునిగిపోయింది.  

లైఫ్‌లో విజయం సాధించాలన్నా, కొన్ని సార్లు ప్రమాదాల నుంచి బతికిబట్టకట్టాలన్నా తదుపరి ఏం చేయబోతున్నామో చెప్పకుండా చేయడమే మంచిదంటూ ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.


More Telugu News