పులిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేసిన గేదెలు..వీడియో ఇదిగో!

  • మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • బెంబెడా గ్రామంలో అటవీ పరిసరాల్లో గేదెల మందపై పులి దాడి
  • పులిపై అనూహ్యంగా మూకుమ్మడి దాడికి దిగిన గేదెలు
  • తీవ్రంగా గాయపడి మరణించిన పులి
గేదెలు, ఆవులపై పులి దాడి చేయడం సాధారణమే కానీ గేదెలు పులిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకాలో ఈ ఘటన వెలుగు చూసింది. కొంతకాలంగా ఆ ప్రాంతంలో పులి సంచారంతో స్థానికుల కంటిమీద కునుకు లేకుండా పోయింది. 

గురువారం ఉదయం ఎస్‌గ్రావ్ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై పులి దాడికి యత్నించింది. చేతిలో ఉన్న గొడ్డలితో అతడు ఎదురు తిరగడంతో త్రుటిలో అతడు చావు నుంచి తప్పించుకోగలిగాడు. ఆ తరువాత పులి బెంబడా గ్రామంలోని అటవీ పరిసరాల్లో మేత మేస్తున్న ఆవులు, గేదెలపై దాడికి యత్నించింది. అయితే, ఊహించని విధంగా గేదెలు పులిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. కొమ్ములతో పొడిచేశాయి. తీవ్రంగా గాయపడ్డ పులిని అటవీ శాఖ అధికారులు చంద్రపూర్‌కు తరలించగా అది చికిత్స పొందుతూ మృతి చెందింది. 




More Telugu News