కూతురు సితారకు, మహేశ్ బాబు ఫౌండేషన్‌కు థ్యాంక్స్ చెప్పిన నమ్రతా శిరోద్కర్!
- కూతురు సితార పుట్టిన రోజు సందర్భంగా 40 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
- బుర్రిపాలెంలోని జెడ్పీ హైస్కూల్లోని విద్యార్థులకు అందించిన ఎంబీ ఫౌండేషన్
- గంటల్లోనే యాభై వేలకు పైగా లైక్స్
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రిన్స్ మహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్ ఈ రోజు సాయంత్రం పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. విద్యార్థుల కళ్లలో తన కూతురు సితార, ఎంబీ ఫౌండేషన్ సంతోషం తీసుకు వచ్చిందంటూ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. దీనికి ఐదారు గంటల్లోనే 50వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
ఇటీవల సితార తన పుట్టిన రోజు వేడుకను మహేశ్ బాబు ఫౌండేషన్ విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు. అంతేకాదు 40 మంది విద్యార్థినులకు సైకిళ్లు కూడా పంపిణీ చేశారు. సూపర్ స్టార్ స్వగ్రామమైన బుర్రిపాలెం జెడ్పీ హైస్కూల్ లో చదువుతున్న నలభై మంది విద్యార్థినులకు ఎంబీ ఫౌండేషన్ (మహేశ్ బాబు ఫౌండేషన్) ద్వారా సైకిళ్లను అందించారు.
ఈ అమ్మాయిలు నలభై మంది సైకిళ్ల ముందు నిలబడి ఫోటో దిగారు. దీనికి సంబంధించిన ఫోటోను నమ్రతా శిరోద్కర్ తన ఇన్ స్టాలో పంచుకున్నారు. ఈ నలభై మంది చిన్నారులు స్కూల్ కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారని, మీరు సైకిళ్లపై స్కూల్ కు వెళ్తున్నందుకు ఆనందంగా ఉందని, చదువును ఆనందంగా నేర్చుకోవడానికి ఇలాంటివి అవసరమని ఇన్ స్టాలో పేర్కొన్నారు. అంతేకాదు, వారిలో సంతోషాన్ని నింపిన సితార ఘట్టమనేనికి, ఈ సాయం అందించిన ఎంబీ ఫౌండేషన్ కు ఆమె ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ ను ముగించారు.