చేపలు తింటే ఐశ్వర్య రాయ్ లాంటి కళ్లు సొంతం.. 'మహా' మంత్రి వ్యాఖ్య

  • నందూర్బార్ జిల్లా బహిరంగ సభలో మహారాష్ట్ర మంత్రి విజయ్‌కుమార్ గవిత్ వ్యాఖ్యలు
  • చేపలు తింటే చర్మం నునుపుగా మారి, కళ్లు మెరుస్తాయని సూచన
  • సముద్ర తీరంలో ఉండే ఐశ్వర్య చేపలు తిని అందమైన కళ్లు సొంతం చేసుకుందని వెల్లడి
రోజూ చేపలు తినేవారికి ఐశ్వర్య రాయ్ లాంటి అందమైన కళ్లు సొంతమవుతాయని మహారాష్ట్ర గిరిజన శాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్ ఇటీవల వ్యాఖ్యానించారు. నందూర్బార్ జిల్లాలో ఓ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 

‘‘రోజూ చేపలు తినేవారి చర్మం నునుపుగా ఉంటుంది. కళ్లు మెరుస్తుంటాయి. అలాంటి వారిని చూసే వారు ఆకర్షణకు లోనవుతారు. నేను ఐశ్వర్యరాయ్ గురించి చెప్పనా? ఆమె మంగళూరులోని సముద్ర తీరంలో నివసించేది. దీంతో, రోజూ చేపలు తినేది. చేపలు తింటే అలాంటి కళ్లు మీ సొంతమవుతాయి’’ అని పేర్కొన్నారు.


More Telugu News