చంద్రయాన్-3 సరికొత్త రికార్డులు, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూయర్‌షిప్
- చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌కు యూట్యూబ్‌లో 8 మిలియన్ల వ్యూస్
- ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చూసిన ప్రత్యక్ష ప్రసారం ఇదే
- 6 మిలియన్లతో రెండోస్థానంలో బ్రెజిల్ - క్రొయేషియా ఫుట్‌బాల్ మ్యాచ్
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. ల్యాండర్ విక్రమ్ బుధవారం సాయంత్రం గం.6.04 నిమిషాలకు దక్షిణ ధృవంపై అడుగు పెట్టింది. దక్షిణ ధృవంపై అడుగిడిగిన తొలి దేశం భారత్ కావడం విశేషం. అంతకుముందు రష్యా పంపించిన లూనా-25 ల్యాండర్ ఇటీవల విఫలం కావడంతో భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3పై ప్రపంచ దృష్టి పడింది. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన సమయంలో యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్‌లో ఎనిమిది మిలియన్లకు పైగా ఏకకాలంలో వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చూసిన ప్రత్యక్ష ప్రసారం ఇదే కావడం గమనార్హం.
చంద్రుడిపై అడుగిడిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశం భారత్. చంద్రయాన్-3 నలభై రోజుల పాటు దాదాపు 3,84,000 కిలో మీటర్లు ప్రయాణించి చంద్రుడిపై ల్యాండ్ అయింది. జులై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3ని ఇస్రో ప్రయోగించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాన్ని అత్యధికమంది చూసింది చంద్రయాన్-3నే. చంద్రయాన్-3ని 8 మిలియన్లమంది చూడగా, ఫిఫా ప్రపంచకప్ 2022లో బ్రెజిల్ వర్సెస్ క్రొయేషియా ఫుట్‌బాల్ మ్యాచ్ 6 మిలియన్ల వ్యూయర్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బ్రెజిల్ వర్సెస్ దక్షిణ కొరియా ఫుట్‌బాల్ మ్యాచ్ 5.2 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచింది.