అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

  • పదవీ విరమణ వయస్సు 65కు పెంచిన ప్రభుత్వం
  • ఉద్యోగ విరమణ చేసే టీచర్లకు, హెల్పర్లకు ఆర్థిక సాయం
  • ఉద్యోగ విరమణ తర్వాత ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయం
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరి పదవీ విరమణ వయస్సును 65కు పెంచారు. అలాగే, ఉద్యోగ విరమణ చేసే టీచర్లకు రూ.1 లక్ష, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.50,000 ఆర్థిక సాయం అందిస్తారు. టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ తర్వాత ఆసరా పెన్షన్లు మంజూరు చేయనున్నారు. 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాల స్థాయిని పెంచారు. ఈ మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత మూడుసార్లు అంగన్వాడీల వేత‌నాలు పెంచారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.



More Telugu News