‘సలార్’ బడ్జెట్‌లో 70 శాతం ఆ సీన్లకే!
- భారీ యాక్షన్ సన్నివేశాలతో తొలిపార్టు
- సెప్టెంబర్ 28న రానున్న ప్రభాస్– ప్రశాంత్ నీల్ చిత్రం
- వచ్చే నెల 7న ట్రైలర్ రిలీజ్!
బాహుబలి తర్వాత ఆ స్థాయి హిట్ కోసం ఆశిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కేజీఎఫ్ చిత్రాలతో క్రేజ్ సంపాదించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 7న ట్రైలర్ విడుదల చేయనుందని తెలుస్తోంది.
షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం మొదటి పార్టు సీజ్ ఫైర్ లో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేశారని తెలుస్తోంది. బడ్జెట్ లో దాదాపు 70 శాతం యాక్షన్ ఎపిసోడ్స్ కోసం కేటాయించారని టాక్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశాడని కూడా ప్రచారం జరుగుతోంది. అది నిజమో కాదో చిత్ర బృందమే చెప్పాలి.