నీరజ్ చోప్రాతో నాకెలాంటి వృత్తి వైరం లేదు: పాక్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్

  • హంగేరీలోని బుడాపెస్ట్ లో వరల్డ్ చాంపియన్ షిప్
  • నీరజ్ చోప్రాతో పాటు ఫైనల్స్ కు, పారిస్ ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన నదీమ్
  • తాను ఎవరితోనూ పోటీ పడనని వెల్లడి
  • నాతో నేనే పోటీ పడతా అంటూ తన పంథా వివరించిన పాక్ అథ్లెట్
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రాతో తనకెలాంటి వృత్తిపరమైన వైరం లేదని పాకిస్థాన్ నెంబర్ వన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ స్పష్టం చేశాడు. భారత్ తరఫున సత్తా చాటుతున్న నీరజ్ చోప్రా వంటి అగ్రశ్రేణి అథ్లెట్ల నుంచి నేర్చుకునేందుకు తానెప్పుడూ సిద్ధమేనని తెలిపాడు. 

"నేను ఎవరితోనూ పోటీ పడను. నాతో నేను పోటీ పడతాను. ఇంకా మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాను. నీరజ్ చోప్రాతోనూ ఇంతే... జావెలిన్ క్రీడాంశంలో అతడితో ఎలాంటి పోటీ లేదు" అని నదీమ్ వివరించాడు. చోప్రా వంటి మెరుగైన అథ్లెట్ల నుంచి ఎల్లప్పుడూ నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. 

హంగేరీలోని బుడాపెస్ట్ లో జరుగుతున్న వరల్డ్ చాంపియన్ షిప్ ఫైనల్ కు నీరజ్ చోప్రాతో పాటు అర్షద్ నదీమ్ కూడా అర్హత సాధించాడు. అంతేకాదు, పారిస్ ఒలింపిక్స్ కూడా వీరిరువురు క్వాలిఫై అయ్యారు. నదీమ్ అర్షద్ దాదాపు ఏడాది తర్వాత జావెలిన్ బరిలో దిగాడు. మోచేతికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు.


More Telugu News