నాలుగు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములను స్పేస్‌స్టేషన్‌కు పంపిన నాసా

  • కేప్‌కెనావెరాల్‌లోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన వ్యోమగాములు
  • నేడు ఐఎస్ఎస్ తో అనుసంధానం
  • ఇప్పటికే అక్కడున్న నలుగురు వ్యోమగాములు భూమికి
వేర్వేరు దేశాలకు చెందిన వ్యోమగాములు నలుగురు నిన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనమయ్యారు. అమెరికాలోని కేప్‌కెనావెరాల్‌లో ఉన్న కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లిన వీరు నేడు అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. 

ఈ మిషన్‌ను ‘క్రూ-7’గా పేర్కొంటున్నారు. ఐఎస్ఎస్ కు వెళ్లిన వారిలో అమెరికా, డెన్మార్క్, జపాన్, రష్యా వ్యోమగాములు ఉన్నారు. ఆరు నెలలపాటు వీరు ఐఎస్ఎస్‌లో ప్రయోగాలు చేస్తారు. మార్చి నుంచి అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వరిస్తున్న వ్యోమగాములను ఈ మిషన్ ద్వారా తిరిగి భూమ్మీదికి తీసుకొస్తారు. కాగా, నాసా ప్రతిసారీ ఇద్దరు ముగ్గురు వ్యోమగాములను మాత్రమే ఐఎస్ఎస్ కు పంపేది. ఈసారి మాత్రం ఒకేసారి నలుగురిని పంపింది.


More Telugu News