ఫస్టు సింగిల్ ను ట్రెండింగ్ నెంబర్ వన్ గా నిలబెట్టిన 'భగవంత్ కేసరి'

  • 'భగవంత్ కేసరి'గా బాలకృష్ణ
  • ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమా 
  • హైలైట్ గా నిలవనున్న తమన్ సంగీతం 
  • అక్టోబర్ 19వ తేదీన సినిమా విడుదల 

బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' సినిమా రూపొందింది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకి ఆయన బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్ లో ఉంటాయని బాలయ్య స్వయంగా చెప్పడం విశేషం. 

ఈ నేపథ్యంలో రీసెంటుగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ప్రోమోను వదిలారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో బాలయ్య - ఆయన కూతురు పాత్రను పోషించిన శ్రీలీల .. ఇతర బృందంపై చిత్రీకరించిన పాట ఇది. యూ ట్యూబ్ లో ఈ ప్రోమో ఇప్పుడు నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచింది. తెలంగాణ యాసలో బాలయ్య చెప్పే డైలాగ్ తో ఈ పాట మొదలవుతోంది. పూర్తి పాటను రేపు రిలీజ్ చేయనున్నారు.

బాలయ్య సరసన నాయికగా కాజల్ కనిపించనున్న ఈ సినిమాలో. అర్జున్ రాంపాల్ విలన్ పాత్రను పోషించాడు. మరో ముఖ్యమైన పాత్రలో ప్రియాంక జవాల్కర్ అలరించనుంది. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 19వ తేదీన విడుదల చేయనున్నారు. బాలయ్య అభిమానులంతా ఇప్పుడు ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు.



More Telugu News