కేసీఆర్‌కే ఓటేస్తామంటూ పంచాయతీలు చేస్తున్న తీర్మానాలపై షబ్బీర్ అలీ ఫైర్!
- బీఆర్ఎస్ ఎన్నికల నిబంధన ఉల్లంఘిస్తోందన్న కాంగ్రెస్ నేత
- కేసీఆర్‌కు ఓటేస్తామని పంచాయతీలు తీర్మానం చేయడం నిబంధన ఉల్లంఘనే అని వ్యాఖ్య
- కేసీఆర్ మెప్పు కోసం కవిత తీర్మానాలు చేయిస్తున్నారని ఆరోపణ
- ఈ తీర్మానాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి
బీఆర్ఎస్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుండి ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారని, అయితే అగస్ట్ 26వ తేదీ నుండి కామారెడ్డిలోని ఒక్కో గ్రామపంచాయతీలో కేసీఆర్‌కు ఓటు వేస్తామని తీర్మానం చేయిస్తున్నారని, గ్రామ పాలక వర్గం నుండి మద్దతు తీర్మానం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.
ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కేసీఆర్ మెప్పు కోసం ఎమ్మెల్సీ కవిత తీర్మానాలు చేయించారన్నారు. తీర్మానం చేసిన సర్పంచ్‌లపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కవితపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలపై గతంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిందని, అధికారులు స్పందించకుంటే తాము న్యాయపరంగా వెళ్తామన్నారు.