ఇస్రో విజయాలకు మతం రంగు పులమాలనుకుంటున్నారు: సీపీఐ నారాయణ

  • ఇస్రో విజయాలను రాజకీయాలకు మోదీ వాడుకోవాలనుకుంటున్నారన్న నారాయణ
  • దేశంలోని కొన్ని కారణాల వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్య
  • దేశం మొత్తం ఒకే పార్టీ ఉండాలని మోదీ అనుకుంటున్నారని విమర్శ
అంతరిక్ష రంగంలో మన దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న ఇస్రోను ప్రతి ఒక్కరూ అభినందించాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. అయితే ఇస్రో విజయాలకు కూడా మతం రంగు పులమాలని ప్రధాని మోదీ చూస్తున్నారని మండిపడ్డారు. ఇస్రో కృషిని రాజకీయాలకు వాడుకునేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. 

దేశ వ్యాప్తంగా నెలకొన్న కొన్ని కారణాల వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని... ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని అన్నారు. ఎన్డీయే కూటమిలో ఒక 8 పార్టీలు తప్ప మిగిలినవన్నీ ఉత్తుత్తి పార్టీలేనని ఎద్దేవా చేశారు. దేశం మొత్తం ఒకే పార్టీ ఉండాలని మోదీ చూస్తున్నారని అన్నారు. జమిలీ ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News