హ్యుండై క్రెటాకు పోటీగా వచ్చిన హోండా క్రేజీ ఎస్ యూవీ
- నేటి నుంచి డెలివరీలు ప్రారంభం
- ధర.11 లక్షల నుంచి.. నాలుగు వేరియంట్లలో లభ్యం
- మైలేజీ 15-17 కిలోమీటర్లు
ఎస్ యూవీ కార్ల విభాగంలో తీవ్ర పోటీ నెలకొంది. దిగ్గజ కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటి ఎస్ యూవీ మోడళ్లను విడుదల చేస్తూ మరింత మార్కెట్ వాటాను సొంతం చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ విభాగంలో బాగా పాప్యులర్ అయిన మోడళ్లలో హ్యుండై క్రెటా ఒకటి. ఈ ఎస్ యూవీకి మంచి ఆదరణ ఉండగా, ఇప్పుడు దీనికి పోటీగా హోండా సంస్థ ఎలివేట్ ను విడుదల చేసింది. ధర రూ. 11 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర) నుంచి మొదలవుతుంది.
హోండా సంస్థకు ఇదే తొలి ఎస్ యూవీ. హ్యుండై క్రెటాతో పాటు మారుతి సుజుకీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. హోండా ఎలివేట్ ఎస్ యూవీ మొత్తం నాలుగు వేరియంట్లలో.. ఎస్ వీ, వీ, వీఎక్స్, జెడ్ ఎక్స్ రకాలుగా లభిస్తుంది. ఎలివేట్ కోసం బుకింగ్ లను హోండా కార్స్ జూలైలోనే ఆరంభించగా, నేటి నుంచి డెలివరీలు ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఎలివేట్ సాయంతో ఎస్ యూవీ మార్కెట్లో తాను ఎలివేట్ అవుదామని హోండా కార్స్ ఆశలు పెట్టుకుంది. సీఆర్ వీ, బీఆర్ వీ, డబ్ల్యూఆర్ వీ మోడళ్లు ఫెయిల్ కావడంతో కొంత సమయం తీసుకుని ఎలివేట్ ను హోండా కార్స్ అభివృద్ధి చేసింది.
ఈ కారు మ్యానువల్ వేరయింట్ 15 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. అదే సీవీటీ వెర్షన్ అయితే 16.92 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.