తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొట్టాలి: రేవంత్ రెడ్డి
- కారు ఢిల్లీకి వెళ్లి కమలంగా మారుతోందని రేవంత్ విసుర్లు
- ఇండియా కూటమి పేరు పలకడం ఇష్టంలేకే భారత్‌గా మారుస్తున్నారని వ్యాఖ్య
- నిజాంల నుండి తెలంగాణకు విముక్తి కలిగించింది వల్లభాయ్ పటేల్ అన్న రేవంత్
ఇండియా కూటమి పేరు పలకడం ఇష్టంలేకనే దేశం పేరును భారత్‌గా మారుస్తామంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశంలో ఎంతోమందికి రక్షణ లేకుండా పోయిందన్నారు. పెరిగిన ధరలను, మణిపూర్ అంశాలపై మోదీ పార్లమెంటులో చర్చించకుండా పారిపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీని తిట్టేందుకే ఆయన సమయం కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏం చేసిందని మోదీ, బీజేపీ నేతలు అడుగుతున్నారని, కానీ గుజరాత్‌లో ఆయన తిరుగుతున్న విమానాశ్రయాన్ని నిర్మించింది కాంగ్రెస్ అని గుర్తుంచుకోవాలన్నారు.
నిజాం నవాబుల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించింది కాంగ్రెస్ నేత సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. విభజించి, పాలించు అనే విధానంతో బీజేపీ ముందుకు సాగుతోందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కారు ఢిల్లీకి వెళ్లి క్రమంగా కమలంగా మారుతోందని బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే అభిప్రాయంతో మాట్లాడారు.