తెలంగాణలో జగన్ ను రాళ్లతో తరిమికొట్టారు.. తుది శ్వాస వరకు జగన్ పై పోరాటం చేస్తా: పవన్ కల్యాణ్
- అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న వారు ఏపీని నాశనం చేస్తున్నారని పవన్ మండిపాటు
- సైకో జగన్ అందరినీ జైలుకు పంపించాలనుకుంటున్నారని విమర్శ
- వారాహి యాత్రలో 50 మందిని చంపేయాలని ప్లాన్ చేశారని ఆరోపణ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లిందని అన్నారు. అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నవారు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు జగన్ ను రాళ్లతో తరిమికొట్టారని, రేపు ఏపీలో కూడా ఆయనకు అదే పరిస్థితి ఎదురుకాబోతోందని అన్నారు. కోనసీమ జిల్లాలో తాను వారాహి యాత్రను చేస్తున్నప్పుడు 2 వేల మంది నేరగాళ్లను దించారని... కనీసం 50 మందిని చంపేయాలని ప్లాన్ చేశారని... అయితే వైసీపీ మూకల కుట్రను తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకుందని చెప్పారు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక సైకో అని... ఆయన జైలుకు వెళ్లినందుకు, అందరినీ జైలుకు పంపించాలనుకుంటున్నారని పవన్ మండిపడ్డారు. జగన్ నువ్వు జైలుకు వెళ్తే... అందరూ వెళ్లాలా? అని ప్రశ్నించారు. జగన్ వైఖరి గురించి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని అన్నారు. కేంద్రంలో ఉన్న నాయకులు కూడా ఒక్కోసారి ఏమీ చేయలేరని అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందనే గౌరవం కూడా జగన్ కు లేదని చెప్పారు. జగన్ ఈ రాష్ట్రానికి హానికరమని.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సి బాధ్యత అందరి మీద ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.