సైమా అవార్డుల్లో మెరిసిన తారలు.. ఫొటోలు ఇవిగో
- దుబాయ్‌లో జరుగుతున్న వేడుక
- నిన్న తెలుగు, కన్నడ అవార్డుల ప్రకటన
- మెరిసిన తారక్, శ్రీలీల, మృణాళ్ ఠాకూర్, ప్రణీత
దక్షిణాది సినీ తారలను ఒక్కచోటుకు చేర్చే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్-2023 (సైమా అవార్డ్స్) వేడుక దుబాయ్ వేదికగా కన్నుల పండువగా సాగుతోంది. తొలి రోజు, నిన్న జరిగిన ఈవెంట్ కి తెలుగు, కన్నడ నటీనటులు హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ లో నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డును ఎన్టీఆర్ అందుకున్నారు. ధమాకా మూవీలో మెరిసిన శ్రీలీల ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర దర్శకధీరుడు రాజమౌళికి ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కింది. సీతారామం ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకుంది. కలర్ ఫుల్, ట్రెండీ దుస్తుల్లో తారలు తళుక్కుమన్నారు. తమ ప్రదర్శనల ఆకట్టుకున్నారు. శ్రీలీల, మృణాల్ ఠాకూర్, ప్రణీత సుభాష్ తమ నాట్యంతో మెప్పించారు.