సిరాజ్ విజృంభణ చూశాక లంక పరిస్థితి "అయ్యో పాపం" అనిపించింది: ఆనంద్ మహీంద్రా

  • ఆసియా కప్ లో నేడు భారత్, శ్రీలంక ఢీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి విలవిల
  • సంచలన బౌలింగ్ తో 5 వికెట్లు తీసిన సిరాజ్
అసలు సిసలైన పేస్ బౌలింగ్ అంటే ఎలా ఉంటుందో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఇవాళ శ్రీలంక జట్టుకు రుచిచూపించాడు. ఆసియా కప్ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక... సిరాజ్ రూపంలో పెనుముప్పు ఎదురవుతుందని ఏమాత్రం ఊహించలేకపోయింది.

స్వింగ్ బౌలింగ్ తో హడలెత్తించిన ఈ హైదరాబాదీ పేసర్ 3 ఓవర్లలో 1 మెయిడెన్ తో 5 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. సిరాజ్ ధాటికి లంక ఇన్నింగ్స్ లో నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. 

సిరాజ్ సంచలన బౌలింగ్ ప్రదర్శనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. తాను ఏనాడూ ప్రత్యర్థి జట్ల పరిస్థితి పట్ల బాధపడలేదని, కానీ ఇవాళ సిరాజ్ బౌలింగ్ చూశాక శ్రీలంక పరిస్థితి అయ్యో పాపం అనిపించిందని తెలిపారు. శ్రీలంకపై ఏదో ఒక మానవాతీత శక్తి విరుచుకుపడినట్టుగా అనిపించిందని, సిరాజ్ నువ్వు నిజంగా మార్వెల్ అవెంజర్ అంటూ ఆనంద్ మహీంద్రా కొనియాడారు.


More Telugu News