చంద్రబాబుకు చుక్కెదురు: సిద్ధార్థ లూథ్రా ట్వీట్, ఒక్క వ్యాఖ్యలో రామ్ గోపాల్ వర్మ కౌంటర్

  • చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత, రెండ్రోజుల రిమాండ్ నేపథ్యంలో లూథ్రా ట్వీట్
  • ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుందని, ఆ ఉదయం వెలుగునిస్తుందని ట్వీట్
  • కానీ జైలు గదిలో పగలు, రాత్రి ఒకేలా ఉంటాయి కదా సర్ అని చురకలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై, రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తోన్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్‌కు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అదే వేదికగా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అలాగే ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్‌ను పొడిగించింది. ఇంకోవైపు ఏసీబీ కోర్టు రెండు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో లూథ్రా ట్వీట్ చేశారు.

ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది, ప్రతి ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుందంటూ శుక్రవారం సాయంత్రం న్యాయస్థానాల తీర్పుల తర్వాత ట్వీట్ చేశారు. చంద్రబాబు కేసును వాదిస్తోన్న ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా ట్వీట్ చేస్తున్నారు. ఆయన తాజా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

సిద్ధార్థ లూథ్రా ట్వీట్‌ను ప్రస్తావిస్తూ రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. లూథ్రా ట్వీట్‌కు కొనసాగింపు అన్నట్లుగా... 'అయితే జైలు గదిలో పగలు, రాత్రి ఒకేలా ఉంటాయ్ కదా సర్?' అని పేర్కొన్నారు. అంతకుముందు కూడా 'సిద్ధార్థ లూథ్రా సిద్ధార్థ అగర్వాల్ X హరీశ్ సాల్వే ఈజ్ నాట్ = (ఈక్వల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి' అంటూ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. అదే ట్వీట్‌లో స్కిల్ స్కామ్ ద్వారా తెలిసిన వాస్తవం ఏమంటే డబ్బులతో నిజాన్ని దాచలేరంటూ చురకలు అంటించారు.


More Telugu News