డీలిమిటేషన్ అంశంపై స్పందించిన మంత్రి కేటీఆర్
- డీలిమిటేషన్లో దక్షిణాదికి సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందన్న కేటీఆర్
- మనమంతా భారతీయులుగా గర్వించాలని వ్యాఖ్య
- ప్రజావేదికలపై దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోమని స్పష్టీకరణ
డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ మంత్రి కేటీ రామారావు స్పందించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత డీలిమిటేషన్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే డీలిమిటేషన్ జరిగితే ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరగవచ్చు? ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు తగ్గవచ్చు? అనే అంచనాలతో కథనాలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ కేటీఆర్ స్పందించారు.
ఈ డీలిమిటేషన్ (నివేదించిన సంఖ్యలు నిజమైతే) మొత్తం దక్షిణ భారతదేశంలో బలమైన ప్రజా ఉద్యమం వస్తుందన్నారు. మనమందరం భారతీయులమని గర్వించాలని, భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలు దక్షిణాది నుంచి ఉన్నాయన్నారు. దేశంలోని ప్రజాస్వామిక వేదికపై మన ప్రజల గొంతుకలను, ప్రాతినిధ్యాన్ని అణచివేస్తే మనం మూగ ప్రేక్షకులుగా ఉండమని హెచ్చరించారు. ఢిల్లీ మన గొంతు వింటుందని వ్యాఖ్యానించారు.