డ్రగ్స్ మత్తులో కెనడా ప్రధాని జీ20 సమావేశాలకు వచ్చారంటూ భారత మాజీ దౌత్యవేత్త సంచలన ఆరోపణ
- ఆయన విమానం నిండా కొకైన్ ఉన్నట్టు స్నిఫర్ డాగ్స్ గుర్తించాయని వెల్లడి
- ట్రూడో రెండు రోజులు తన గది నుంచి బయటకు రాలేదన్న దీపక్ వోహ్రా
- కెనడా, భారత్ మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలు
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో ఆ దేశ పార్లమెంటులో ప్రకటన చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. మరోవైపు జస్టిన్ ట్రూడో వ్యవహార శైలిపై ఈ మధ్య తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట జీ20 సదస్సు కోసం ట్రూడో భారత్‌కు వచ్చినప్పుడు ఆయన డ్రగ్స్ మత్తులో ఉన్నారంటూ భారత మాజీ దౌత్యవేత్త దీపక్ వోహ్రా సంచలన విషయాలు వెల్లడించారు. జస్టిన్ ట్రూడో విమానంలో కొకైన్ నిండుగా ఉన్నట్టు స్నిఫర్ డాగ్స్ గుర్తించాయన్నారు. ట్రూడూ రెండు రోజుల పాటు తన హోటల్ గది నుంచి బయటకు రాలేదన్నారు. అందుకే జీ20 కార్యక్రమాలకు హాజరుకాలేకపోయారంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు.