పిల్లల్ని కంటే ప్రపంచాన్ని కాపాడినట్టు: ఎలాన్ మస్క్
- పిల్లల్ని కనాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన పారిశ్రామికవేత్త
- హంగేరీ అధ్యక్షురాలితో జనాభా సంక్షోభంపై చర్చలు
- కుమారుడ్ని భుజాలపై వేసుకుని టెస్లా ఫ్యాక్టరీలో పర్యటన
టెస్లా, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి పిల్లల ప్రాధాన్యత గురించి ప్రపంచానికి గుర్తు చేశారు. టెక్సాస్ లోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో ఆయన మంగళవారం పర్యటించారు. ఆయన వెంట కుమారుడు
X Æ A-12 కూడా ఉన్నాడు. మస్క్ కు మొత్తం 11 మంది పిల్లలు సంతానంగా ఉన్నారు. ఈ సందర్భంగా హంగేరియన్ అధ్యక్షురాలు కటాలిన్ నోవక్ తో మస్క్ భేటీ అయ్యి ప్రపంచ జనాభా సంక్షోభం గురించి చర్చించారు. పడిపోతున్న జనాభా సంక్షోభం గురించి గతవారం బుడాపెస్ట్ లో ద్వైవార్షిక జనాభా సదస్సు జరిగింది. దీనికి మస్క్ హాజరు కాలేకపోయారు.
దీంతో తన ఫ్యాక్టరీకి విచ్చేసిన హంగేరీ అధ్యక్షురాలు కటాలిన్ కు స్వాగతం పలికి ఆమెతో కలసి అంతటా పర్యటించారు. ఆ సమయంలో కుమారుడ్ని ఆయన భుజాలపై కూర్చోబెట్టుకుని కనిపించారు. అనంతరం కటాలిన్ నోవక్ తో మస్క్ జనాభా సంక్షోభంపై చర్చలు నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మస్క్ ఓ ట్వీట్ వదిలారు. ‘‘పిల్లల్ని కలిగి ఉండడం అంటే ప్రపంచాన్ని కాపాడినట్టే’’అంటూ ట్వీట్ చేశారు. దీనిపై కటాలిన్ ఫేస్ బుక్ లో స్పందించారు. పిల్లల్ని కలిగి ఉంటామనే ధైర్యం యువతరంలో కలిగించే విషయమై మస్క్, తాను చర్చలు నిర్వహించినట్టు ప్రకటించారు. నేటి కాలంలో సంతానం లేని తనం ఎంతో ఆందోళన కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు.