భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
- అమెరికా, జర్మనీ, స్వీడన్ శాస్త్రవేత్తలను వరించిన నోబెల్
- ఫెర్రీ అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, అన్నె ఎల్ హ్యూలియర్‌లకు నోబెల్ బహుమతి
- నోబెల్ గ్రహీతలకు 11 మిలియన్ల స్వీడిష్ క్రౌన్స్
2023 ఏడాదికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. భౌతికశాస్త్రంలో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు ఈ సంవత్సరానికి నోబెల్ ప్రకటించారు. ఒక పదార్థంలో ఎలక్ట్రాన్ డైనమిక్స్ అధ్యయనం కోసం కాంతి యొక్క ఆటో సెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక పద్ధతులకు గాను వీరిని నోబెల్ వరించింది.
ఈ ఏడాది నోబెల్ బహుమతి గెలుచుకున్నవారికి నోబెల్ ఫౌండేషన్ 11 మిలియన్ల స్వీడిష్ క్రౌన్స్ (986,000 డాలర్లు) అందించనుంది. 2012లో ప్రైజ్ మనీని 10 మిలియన్ క్రౌన్స్ నుంచి 8 మిలియన్ క్రౌన్స్‌కు తగ్గించారు. 2017లో తిరిగి 9 మిలియన్ క్రౌన్స్, 2020లో 10 మిలియన్ క్రౌన్స్‌కు పెంచారు. ఇప్పుడు 11 మిలియన్లకు పెంచారు.