ముంబై విమానాశ్రయంలో కాళ్లకి చెప్పులు లేకుండా కనిపించిన రామ్ చరణ్!
- ఓ యాడ్ షూటింగ్ కోసం ఆర్థిక రాజధానికి వచ్చిన గ్లోబల్ స్టార్
- నల్లటి దుస్తులలో, చెప్పులు లేకుండా రామ్ చరణ్
- రేపు సిద్ధివినాయక ఆలయ సందర్శన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంగళవారం ముంబైలో అడుగుపెట్టారు. ఆయన ప్రీమియర్ యాడ్ షూట్ కోసం దేశ ఆర్థిక రాజధానికి వచ్చారు. ఈ సందర్భంగా కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తూ ముంబై విమానాశ్రయంలో కనిపించారు. నల్లటి దుస్తుల్లో కనిపించారు. ప్రతి సంవత్సరం ఆయన అయ్యప్ప దీక్షను తీసుకుంటారు. మాలధారణ సమయంలో సినిమా షూటింగ్, ఇతర వ్యాపకాల్లో బిజీగా ఉన్నప్పటికీ దీక్షా పద్ధతులను తప్పకుండా పాటిస్తారు. తాజాగా ఓ యాడ్ షూట్ కోసం ముంబై వచ్చిన రామ్ చరణ్ రేపు ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించనున్నారు.