తన పేరుతో రూపొందించిన టీమిండియా జెర్సీ ఫొటోలు పంచుకున్న ఆనంద్ మహీంద్రా

  • నేటి నుంచి భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్
  • ఐయాం రెడీ అంటూ క్రికెటోత్సాహం ప్రదర్శించిన ఆనంద్ మహీంద్రా
  • తన పేరిట రూపొందించిన ప్రత్యేక జెర్సీల ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టు
దేశంలో వరల్డ్ కప్ మేనియా నెలకొంది. క్రీడలను విశేషంగా అభిమానించే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా నేను రెడీ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించేశారు. ఇవాళ్టి నుంచి నవంబరు 19 వరకు భారత్ లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఆనంద్ మహీంద్రా ఎక్స్ లో ఆసక్తికరంగా స్పందించారు. ఐయాం రెడీ... థాంక్యూ బీసీసీఐ, టెక్ మహీంద్రా అంటూ పోస్టు పెట్టారు. ఆనంద్ పంచుకున్న ఫొటోల్లో టీమిండియా జెర్సీ ఉంది. దానిపై ఆనంద్ 55 అని రాసి ఉంది. ఈ ప్రత్యేక జెర్సీని బీసీసీఐ ఆనంద్ మహీంద్రాకు బహూకరించినట్టు తెలుస్తోంది. మహీంద్రా గ్రూప్ నకు చెందిన ఐటీ విభాగం టెక్ మహీంద్రా బీసీసీఐకి డిజిటల్ పార్టనర్ గా కొనసాగుతోంది.


More Telugu News