విజయదశమికి మహేశ్ రచ్చ ఖాయమేనట!
- మాస్ యాక్షన్ నేపథ్యంలో 'గుంటూరు కారం'
- మహేశ్ ను డిఫరెంట్ లుక్ తో చూపిస్తున్న త్రివిక్రమ్
- సంగీతాన్ని అందించిన తమన్
- జనవరి 12వ తేదీన విడుదల
మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో 'గుంటూరు కారం' సినిమా రూపొందుతోంది. హారిక - హాసిని బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అటు త్రివిక్రమ్ ... ఇటు మహేశ్ మార్కుతో ఈ సినిమా ఉండనుంది. ఇంతవరకూ వదిలిన పోస్టర్లు అంచనాలు పెంచేశాయి.
ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆయన బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా నుంచి 'విజయదశమి'కి ఒక సాంగ్ వదలనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. అయితే అది నిజమేనా అనే సందేహంలో చాలామంది ఉన్నారు.
నిజంగానే 'విజయదశమి'కి ఒక సాంగ్ ను రిలీజ్ చేయనున్నరనే అంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే మాస్ బీట్ ను వదులుతారా? మెలోడీని రిలీజ్ చేస్తారా? అనేది చూడాలి. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, మీనాక్షి చౌదరి కూడా మెరవనుంది. జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.