'హలో' అంటూ పలకరించిన మహేశ్ బాబు... ఫొటోలు ఇవిగో!
- వరల్డ్ ఫేమస్ మ్యాగజైన్ పై మహేశ్ బాబు ఫొటోలు
- ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న సూపర్ స్టార్
- అభిమానుల నుంచి విశేష స్పందన
అంతర్జాతీయ ఎంతో పేరుగాంచిన 'హలో' మ్యాగజైన్ తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫొటోలను ప్రచురించింది. వివిధ పోజుల్లో, మహేశ్ బాబు తన గ్లామర్ ఉట్టిపడేలా 'హలో' మ్యాగజైన్ పై ఆకట్టుకునేలా ఉన్నారు. 'హలో వరల్డ్' అంటూ మహేశ్ బాబు ఈ మ్యాగజైన్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలపై అభిమానులు విశేషంగా స్పందిస్తున్నారు.
మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి, శ్రీలీల ఇందులో కథానాయికలు. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం 'గుంటూరు కారం'. వీరిద్దరి కలయికలో ఇప్పటివరకు అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి.