కుల్దీప్ బంతికి కన్ఫ్యూజ్ అయిన మిచెల్.. పడిపడీ నవ్విన రోహిత్ శర్మ
- కుల్దీప్ విసిరిన బంతికి కంగారుపడిన మిచెల్
- రివర్స్ స్వీప్ ఆడబోయి విఫలం
- బంతి చేతికి తాకడంతో కాసేపు విల్లవిల్లాడిన డరిల్
- 33వ ఓవర్‌లో ఘటన
భారత్‌తో గతరాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్ డరిల్ మిచెల్ కెరియర్‌లోనే బెస్ట్ సాధించాడు. 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 130 పరుగులు చేశాడు. క్రీజులో పాతుకుపోయిన మిచెల్ 49.5 ఓవర్ల వద్ద మిచెల్ బౌలింగులో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. బౌలర్లందరినీ అలవోకగా ఎదుర్కొని శతకం సాధించిన డరిల్ కుల్దీప్ యాదవ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు.
113, 114 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరిన కుల్దీప్ యాదవ్.. 33వ ఓవర్‌లో మిచెల్‌ను ఇబ్బంది పెట్టాడు. ఆ ఓవర్‌లో 114 కిలోమీటర్ల వేగంతో విసిరిన షార్ట్ డెలివరీ మిచెల్‌ను మరింత కంగారుపెట్టింది. బంతి ఎటువస్తుందో, ఎటు వెళ్తుందో తెలియక మిచెల్ షాకయ్యాడు. రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అతడు తేరుకునే లోపే బంతి అతడి కుడిచేతికి తాకింది. ఏం జరిగిందో అతడికి కాసేపు అర్థం కాలేదు.
బంతి వేగంగా తగలడంతో మిచెల్ కాసేపు బాధతో విలవిల్లాడాడు. కుల్దీప్ బంతితో కంగారుపడిన మిచెల్‌ను చూసి కెప్టెన్ రోహిత్ శర్మ నవ్వాపుకోలేకపోయాడు. గట్టిగా నవ్వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి